News

భారత సైన్యంలో దేశద్రోహులు!

644views
  • పాకిస్తాన్, చైనాలకు ర‌క్ష‌ణ స‌మాచారం చేర‌వేత‌

  • గుర్తించిన నిఘా సంస్థలు

న్యూఢిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడించాయి. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వారు సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలిందని చెప్పాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపాయి.
‘‘వారికి పొరుగు దేశంతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని నిఘా అధికారులు తెలిపారు. దీనిపై ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు. పాక్, చైనా గూఢచారులు మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి సైనికాధికారులపై వల పన్నుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా కొందరు అధికారులు వారి గాలానికి చిక్కినట్టు తెలుస్తోందని నిఘా వర్గాలు వివరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి