News

మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసాహార వంట‌కం!

443views
  • మండిప‌డుతున్న భ‌క్తులు

గుంటూరు: హిందూ దేవాలయం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయ క్యాంటింన్‌లో మాంసాహారం వండారు. గుంటూరు జిల్లా, పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసాహార కలకలం సృష్టించింది. ఆలయ క్యాంటిన్‌లో క్యాంటిన్ నిర్వాహకులు మాంసాహార వంటలను వండారు.

అయితే, ఈ క్యాంటిన్ వ్యాపారం నిర్వహించే వ్యక్తికి నిర్వహణకు ఇచ్చారు. భక్తులకు అల్పాహారం, అన్నదానం అందించేలా క్యాంటిన్‌ను వేలంలో దేవాదాయశాఖ అప్పగించింది. అయితే, తనకు వచ్చిన ఓ ఆర్డ‌ర్‌లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని క్యాంటిన్‌లో మాంసాహారం వండి.. బయటకు పంపించినట్టు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌ను గమనించిన భక్తులు ఫోటోలు తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు, ఆలయ అధికారులు స్థానికులు మండిపడుతున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి