News

గూగుల్, యూట్యూబ్లకు రష్యా వార్నింగ్

482views

విదేశీ సోషల్మీడియా సంస్థలు గూగుల్, యూట్యూబ్ లు తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. యూట్యూబ్ చర్యలు తీవ్రవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయని, అవి రష్యా ప్రజల ఆరోగ్యానికి, ఆలోచనా విధానాలకి కూడా ముప్పు కలిగించేలా ఉన్నాయని విమర్శించింది. ఇప్పటికే ఆ దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లను నిలిపేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.