News

భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ కాల్చివేత‌!

657views

పంజాబ్‌: అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ నంగల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగానే దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ సంఘ‌ట‌న పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా మలియన్ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. టోర్నీ జరుగుతుండగా అక్కడకు వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సందీప్‌ను వెంబడించి మరీ కాల్చి చంపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సందీప్ తల, చాతీ భాగంలోకి ఎనిమిది నుంచి 10 బుల్లెట్లు దూసుకెళ్ళాయి. తుపాకీ చప్పుళ్ళు వినిపించగానే క్రీడాకారులు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. జలంధర్‌లోని షాకోట్‌కు సమీపంలోని నంగల్ అంబియన్ గ్రామానికి చెందిన సందీప్ ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తరచు కబడ్డీ టోర్నీలు నిర్వ‌హిస్తుంటాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి