News

సింహాచలం ఆలయంలో చోరీ

497views

విశాఖ‌ప‌ట్నం: సింహాచలం ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం కొండ కింద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి యత్నించారు. దక్షిణ ద్వారం తలుపులు విరగ్గొట్టారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. సెక్యూరిటీ గార్డులు వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. కాగా, ఈ మధ్య అప్పన్న ఉపదేవాలయం బంగారమ్మ గుడిలో చోరీ జరిగింది. సింహాచలం దేవస్థానంలో వరుస ఘటనలపై స్పందన కరువైంద‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి