News

హిందూ బాలిక‌పై ఇస్లామిస్ట్ లైంగిక వేధింపులు!

633views

గుజ‌రాత్‌: ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న హిందూ బాలిక‌పై ఓ ఇస్లామిస్ట్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. 30 ఏళ్ళ‌ రహీమ్ హనీఫ్ షేక్ ఈ నెల 21న గుజరాత్‌లోని కచ్ జిల్లా, రాపర్‌లోని పాఠశాలలో అనుమ‌తి లేకుండా ప్రవేశించాడు. ఉపాధ్యాయులు ప్రశ్నించగా, అతను ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ళ‌ హిందూ బాలికకు ‘మామ’ అని చెప్పాడు. తర్వాత బలవంతంగా తన తరగతి గదిలో బాలిక పుట్టినరోజు జరుపుకొని, సెల్ఫీ తీసుకుని ఆ బాలిక‌కు గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు.

బిక్కు బిక్కుమంటూ ఆ బాలిక ఇంటికి చేరుకుని, తల్లిదండ్రులకు జ‌రిగిన‌దంతా చెప్పింది. వారు ఆ పెట్టెను తెర‌వ‌గా చాక్లెట్లు, ‘ఐ లవ్ యూ’ అని రాసిన కాగితం ఉంది. బాలిక కుటుంబం వెంటనే పాఠశాలను సంప్రదించింది. అయితే, పాఠశాల యాజ‌మాన్యం ఈ విషయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిందని, పోలీసులకు తెలియజేయడంలో విఫలమైందని వారు ఆరోపించారు.

ఈ వార్త స్థానిక మీడియాకు చేరిన తర్వాత మాత్రమే పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితుడిని ఈ నెల 23న పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ సంఘ‌ట‌న‌పై హిందూ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా, షేక్ పాఠశాలలో ఉపాధ్యాయులను కూడా బెదిరించినట్టు నివేదికలు ఉన్నాయి.

Source: Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి