News

గురుగ్రామ్ మదర్సాలో బాలికలపై సామూహిక అత్యాచారం!

502views
  • ఆ వీడియోల‌తో బ్లాక్ మెయిలింగ్‌, రూ. 10 ల‌క్ష‌ల డిమాండ్‌

  • చెల్లించ‌క‌పోవ‌డంతో సోష‌ల్ మీడియోలో ట్రోల్‌

  • ఎనిమిది మంది కామాంధుల అరెస్టు

గురుగ్రామ్: ఇక్క‌డి మదర్సాలో ఇద్దరు బాలికలపై అత్యాచారం జ‌రిగింది. పోలీసులు మౌల్వీ మహమ్మద్ హసన్, తైయాబ్, వారిస్, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. నేర‌స్తులు ఈ దారుణ వీడియోలను ఉపయోగించి బాధిత కుటుంబాలను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలు చెల్లించకపోవడంతో వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న వీడియోను ఓ బాధిత బాలిక తండ్రి చూడడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అతను గురుగ్రామ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు నమోదు చేసే సమయానికి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నేరస్తులు మౌల్వీ మహ్మద్ హసన్, జహుల్హక్, ఫకృద్దీన్, ముస్తాక్, యూనస్, ముస్తఫా, తైయాబ్, వారిస్‌లు… వీడియో డిలీట్ చేయాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేశారని బాలిక‌ తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. గురుగ్రామ్‌లోని పున్హానాలోని మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాలికలు ఇస్లామిక్ చదువు కోసం మదర్సాకు వెళ్ళేవారని పోలీసులకు మరింత సమాచారం అందింది. మౌల్వీ మహమ్మద్ హసన్, బంధువులు తైయాబ్, వారిస్ కూడా తరచుగా మదర్సాకు వెళ్ళేవారు. వారు చాలా కాలం పాటు బాలికలపై క‌న్నేసి, చివరికి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేలా మౌల్వీకి లంచం ఇచ్చారు.

తైయాబ్, వారిస్ బాలికల వద్దకు వచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వారు దాడికి సంబంధించిన వీడియోను కూడా రికార్డ్ చేశారు. వీడియోను వైరల్ చేస్తామని బెదిరించడం ద్వారా బాలికలను శారీరకంగా హింసించడం కొనసాగించారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి