News

లావణ్య ఆత్మహత్య కేసు… సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు!

444views

న్యూఢిల్లీ: లావణ్య ఆత్మహత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీ.బీ.ఐ) మంగళవారం (ఫిబ్రవరి 15) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం (ఫిబ్రవరి 14) వెలువరించిన తీర్పులో, కేసును సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేస్తూ తమిళనాడు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన కేసును తమిళనాడు హైకోర్టు మధురై బెంచ్ సీబీఐకి బదిలీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

తమిళనాడులోని తంజావూరులో లావణ్య అనే 17 ఏళ్ల బాలిక క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించినందుకు బలవన్మరణానికి పాల్పడింది. ఆమె జనవరి తొమ్మిదోతేదీన‌ విషం సేవించి, 10 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి జనవరి 19న మరణించింది.

Source: Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి