
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఓ ముస్లిం డ్రైవర్ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం, యాసిన్ ఇనయితుల్లా తన ట్రక్కులో ఎర్రచందనం రవాణా చేస్తూ కర్ణాటక-ఆంధ్రా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్నాడు. సరిహద్దు దాటిన తర్వాత సాంగ్లీ జిల్లా మీరజ్ నగర్ గాంధీచౌక్ వద్ద మహారాష్ట్ర పోలీసులు అతడిని అడ్డుకున్నారు. రూ.2.45 కోట్ల విలువైన చందనం, రూ.10 లక్షల విలువైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడం మాట్లాడుతూ, “ఎర్ర చందనం అక్రమ రవాణా గురించి మాకు రహస్య సమాచారం అందింది. అటవీశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాం. ఈ దాడిలో మేము ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాము ఒక నిందితుడిని అరెస్టు చేసాము. 2.45 కోట్ల విలువైన 1 టన్ను చందనం, వాహనం విలువ రూ. 10 లక్షలు ఉంటుంది. కేసు నమోదు చేసాము. అటవీ చట్టంలోని వివిధ సెక్షన్లు కూడా పెట్టాము” అని తెలిపారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





