News

భారత హాకీ క్రీడాకారుడికి అంతర్జాతీయ పురస్కారం

558views

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్​కీపర్​ శ్రీజేష్​కు అరుదైన గౌరవం దక్కింది.​ ప్రతిష్ఠాత్మక వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డును ఆయన దక్కించుకున్నాడు. భారత్​ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్​గా నిలిచాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ ఈ ఘనత సాధించింది.

ఈ అవార్డు కోసం శ్రీజేష్​తో పాటు స్పెయిన్‌కు చెందిన అల్బెర్టో గినెస్ లోపెజ్​, ఇటలీకి చెందిన వుషు ప్లేయర్ మిచెల్ గియోర్డానోలు పోటీ పడ్డారు. విజేతను నిర్ణయించేందుకు ఆన్​లైన్​ ఓటింగ్​ నిర్వహించగా.. శ్రీజేష్​కు 1,27,647 ఓట్లు దక్కాయి. లోపెజ్​-67,428, గియోర్డానో-52,046 ఓట్లు మాత్రమే పొందారు. శ్రీజేష్​ ఇప్పటి వరకు మూడు సార్లు ఒలింపిక్స్​లో పాల్గొన్నారు. 240కు పైగా అంతర్జాతీయ ప్రదర్శనలు చేశాడు. టోక్యో ఒలింపిక్స్​లో​ భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి