News

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధం

584views

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా, ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక పరివర్తన దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధమయ్యాయి. దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహన్ భాగవత్ వంటి అతిరథ మహారథులు ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి.

చిన్న జీయర్ స్వామి ప్రముఖులకు స్వయంగా ఆహ్వాన పత్రికలను పంచారు. 216 అడుగుల రామానుజాచార్యులు ప్రతిమను ఈ సందర్భంగా ఆవిష్కరింపనున్నారు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యంతో పాటు దేవునిపై చూపవలసిన అనస్యసామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుని జీవితం చక్కని ఉదాహరణని చిన్నజీయర్ స్వామి తెలిపారు.

బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సప్రమాదాయలన్ని అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేనవి, ఈ మతాలు దేవుడిని కొలవడానికి వచ్చిన వేర్వేరు మార్గాలేకాని, వైదిక మతానికి బదులుగా పఠించవలసినవికాదని రామానుజాచార్యులు నిరూపించారు. ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని సొగసులు సరిదిద్ది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజాచార్యులు ప్రతిపాదించారు. ప్రస్థాన‌ త్రయాన్ని సాధారణ జనానికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

  • 216 అడుగుల రామానుజ విగ్రహవిష్కరణ

చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో 216 అడుగుల రామానుజ విగ్రహ ఆవిష్కరణతో పాటు 108 విష్ణు ఆలయాలను సైతం ఈ సందర్భంగా ప్రతిష్ఠించనున్నారు. దివ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్ దర్శనమిస్తుంది. అలాగే పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ. 25 కోట్లు వెచ్చించి ఈ ఫౌంటెయిన్ నిర్మించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి