
629views
-
తయారీకి ప్రభుత్వం సహకరించడం లేదు
-
ఆనందయ్య వెల్లడి
మంగళగిరి: కరోనా మందును దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆనందయ్య తెలిపారు. కరోనాలో ఎన్ని వేరియంట్లు వచ్చిన మందులు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మందు తయారికీ ప్రభుత్వం సహకరించడంలేదన్న ఆయన… అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీ ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనందయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.





