
కొట్టాయం: కొట్టాయంలోని పాలకు చెందిన అఫ్జల్ అనే ప్రైవేట్ బస్ కండక్టర్ 13 ఏళ్ళ ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ప్రైవేట్ బస్టాండ్‌లో ఆపి ఉంచిన బస్సులోనే ఆ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ దారుణం ఈ నెల 15 మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగింది.
అఫ్జల్ (31).. బస్సు డ్రైవర్ ఎబిన్ (35), మరో బస్సు కండక్టర్ సహాయంతో బాలికను బస్సులోకి రప్పించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అఫ్జల్ కొట్టాయం వాసి కాగా, ఎబిన్ ఇడుక్కి వాసి.
తుండపరంబిల్ హౌస్‌కు చెందిన అఫ్జల్‌కు ఇదివరకే వివాహమై చిన్న పిల్లాడు ఉండగా, బాలికను ప్రేమిస్తున్నట్టు నటించాడు. అందిన సమాచారం ప్రకారం, ఆ బాలిక ఆ బస్సుకు రోజువారీ ప్రయాణికురాలు. శనివారం బస్టాండ్‌కు రావాల్సిందిగా ఆ బాలికను కోరాడు. ఇందుకు ఆ బస్సులోని ఇద్దరు ఉద్యోగులు సహకరించారు.
అఫ్జల్, ఎబిన్ బస్సు యజమానికి జ్వరం అని అబద్ధం చెప్పారు. 1:30 PM ట్రిప్‌కు అతని స్నేహితుడైన మరొక కండక్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ముగ్గురూ కూడబల్కొని ప్రయాణికులు లేరంటూ సర్వీసును రద్దు చేసుకున్నారు. ఎబిన్, కొత్త కండక్టర్.. బాలిక, అఫ్జల్‌ను లోపల వదిలి, బస్సు కిటికీ షట్టర్‌లను డౌన్ చేసిన అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిపోయారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాజు జోస్‌కు ఈ సమాచారం అందింది. పోలీసు బృందంతో దాడి చేసి, నిందితుడిని పట్టుకున్నారు. అయితే, అప్పటికే నిందితుడు బాలికపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితులు ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. కొత్త కండక్టర్ పరారీలో ఉన్నాడు.
Source: Hindupost





