
-
కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు
రాయ్‌గఢ్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను దాచారని ఆరోపించాడు. అంతేకాదు, సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతన్ కక్కడ్ ఈ ఆరోపణలు చేయగా సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.
సల్మాన్ ఖాన్ న్యాయవాది కేతన్ కక్కడ్ సోషల్ మీడియా పోస్ట్‌లు, ఇంటర్వ్యూల భాగాలను చదివి వినిపించారు. అందులో అతను సల్మాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో సినీ తారల మృతదేహాలను ఖననం చేశారని, పిల్లల అక్రమ రవాణా కూడా అక్కడ జరుగుతోందని కేతన్ కక్కడ్ ఆరోపించినట్టు లైవ్ లా.ఇన్ నివేదించింది.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పన్వేల్‌లో ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ పక్కనే కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. కేతన్ కక్కడ్ అనే వ్యక్తి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఫాంహౌస్ పక్కన మరింత భూమిని కొనుగోలు చేయాలనుకున్న కేతన్ కక్కడ్ అది కుదరకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేశాడని చెబుతున్నారు.
కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని సల్మాన్ ఖాన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సల్మాన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు కేతన్ కక్కడ్ తరుపు న్యాయవాది గడువు కోరడంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
Source: NationalistHub





