
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్,నాగపూర్, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, సౌజన్యంతో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా భారత స్వాతంత్య్ర సముపార్జన కోసం 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాల పాటు జరిగిన స్వతంత్ర పోరాటంలో అనేక ఘట్టాలను వివరణాత్మకంగా రెండు భాగాలుగా రెండు రోజులపాటు ప్రదర్శించటానికి ఆంధ్రప్రదేశ్ సంస్కారభారతి శాఖ ఏర్పాట్లు చేసింది. సుమారు 75 మంది కళాకారులతో, ఆధునిక సాంకేతికతతో, భారీ సెట్టింగులతో, ప్రత్యేకంగా సమకూర్చిన సంగీతంతో సుమధురమైన దేశభక్తిని రేకెత్తించే గీతాలతో కూచిపూడి, భరత నాట్య నృత్య ప్రదర్శనలతో బుర్రకథ నేపథ్యంలో ఈ ప్రదర్శనలు ఉంటాయి.
రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం


ఆహ్వాన పత్రిక
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేతాజీ జన్మదినోత్సవము రోజు నుండి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించినందున స్వాతంత్ర్య సంగ్రామం నాటకం యొక్క ఆహ్వానము మరియు గోడ పత్రికలు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సంస్కారభారతి ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ తెలిపారు.





