News

ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు

471views

ఇస్లామాబాద్‌: జమాత్-ఎ-ఇస్లామీ అధినేత సిరాజుల్ హక్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లాహోర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను పక్కకు పంపిస్తేనే పాకిస్తాన్ సంక్షోభానికి తెరపడుతుందని వ్యాఖలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో పాకిస్తాన్ అడుక్కుంటున్నందుకు ఇమ్రాన్ ఖాన్ “అంతర్జాతీయ బిచ్చగాడు” అయ్యాడని అన్నారు. “ఈ దేశంలో రాజకీయాల నుండి ప్లస్‌లు లేదా మైనస్‌లకు స్థానం లేదు, ఎందుకంటే అన్ని సమస్యలకు ఇమ్రాన్ ఖాన్ నిష్క్రమణ మాత్రమే పరిష్కారం. ప్రభుత్వం పెట్రోలియం ధరలను మళ్లీ పెంచింది. దేశంలో ద్రవ్యోల్బణం ప్రజల పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది” అని చెప్పుకొచ్చాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి