News

యాలూరులో హిందూ సమ్మేళనం

1kviews

నంద్యాల‌: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం, యాలూరులోని ఆది జాంబవ కాలనీలో హిందూ సమ్మేళనం ఈ నెల 24న జ‌రిగింది. ప్ర‌ధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ కర్నూల్ విభాగ్ కార్యకారిణి డాక్టర్ ఉదయ శంకర్ పాల్గొని, మాట్లాడారు. హిందూ మతం గొప్పతనం, హిందూమతంలో ఆది జాంబవుల గొప్పతనం, దేశ విదేశాల్లో హిందూ మతం ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న, ఎదుర్కోబోతున్న సమస్యలను వివరించారు.

ఈ ప‌రిస్థితుల్లో హిందూ ధర్మ పునర్వైభవస్థితికి చేర్చటానికి మనందరం కులాలను ప్రక్కన బెట్టి, సంఘటితమై పోరాడవలసిన అవసరాన్ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కర్నూల్ విభాగ ప్రముఖ్ శ్యామ్ ప్రసాద్, నంద్యాల జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర ప్రసాద్, రామ నరసింహ, బాబు, గోపి, మధు, గ్రామ‌స్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి