News

లాక్‌డౌన్‌ దిశగా బ్రిటన్

622views

లండ‌న్‌: బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్​, స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లాండ్​లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్​ జాన్సన్​, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి ఇంటి నుంచే పని, మాస్క్​, కొవిడ్​ టీకా ధ్రువపత్రం తప్పనిసరి వంటి ప్లాన్​ బీ చర్యలు అమలులో ఉన్నాయి. మరోవైపు.. వేల్స్​లో రాత్రి క్లబ్​లు ఆదివారం నుంచి మూసివేయాలని ఆదేశించారు. పబ్బులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లల్లో ఆరుగురుకి మించి గుమికూడదు. ఇండోర్​ ఈవెంట్స్​కు 30 మంది, బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు.