News

హిందూ మహా సముద్రంలో మునిగిన నౌక

579views
  • 17 మంది మృతి, 68 మంది గల్లంతు

మడగాస్కర్‌: మడగాస్కర్‌ ఈశాన్య తీరంలో సోమవారం తెల్లవారుజామున 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 68 మంది గల్లంతయ్యారు. మిగిలిన 45 మందిని తీర రక్షక అధికారులు కాపాడారు. మనానరా నార్త్‌ జిల్లాలోని అంటానంబె నగరం నుంచి సొవానియెరనా ఇవోంగో ఓడరేవుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నౌక అడుగు భాగానికి రంధ్రం కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి