
576views
అమృతసర్: అమృసర్‌లోని స్వర్ణ మందిరంలోకి ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. అక్కడున్న కత్తిని తీసుకుని గురుగ్రంథ్ సాహిబ్ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ టాస్క్ఫోర్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మృతిచెందాడు.
ఈ మేరకు అమృత్సర్ డీసీపీ పరమీందర్ సింగ్ బందాల్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. మృతదేహాన్ని అమృతసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారిస్తున్నారు. పవిత్రమైన గురుగ్రంథ్ సాహిబ్ పుస్తకం సురక్షితంగానే ఉందని దానిని ఎవరూ పట్టుకోలేదని స్పష్టం చేశారు.





