News

ఆసియా రోయింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు స్వర్ణం

549views

సియా రోయింగ్‌ ఛాంపియన్‌షిప్ ‌లో భారత క్రీడాకారులు అర్జున్‌ లాల్ ‌- రవి సత్తా చాటారు. పురుషుల డబుల్స్‌ లో వీరి జోడీ స్వర్ణం గెలుచుకుంది. శనివారం జరిగిన రేసులో అర్జున్ ‌- రవి జంట 6 నిమిషాల 57.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో చైనా, ఉజ్బెకిస్థాన్‌ లను వెనక్కి నెట్టింది.

సింగిల్స్ ‌లో పర్మీందర్‌ సింగ్‌ రజతం గెలిచాడు. ఫైనల్ లో పర్మీందర్‌ 8 నిమిషాల 7.32 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని రెండో స్థానంలో నిలిచాడు. షఖ్‌బోజ్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. శనివారం భారత రోయర్లు మరో ఐదు, ఫైనల్స్ బరిలో దిగే నేపథ్యంలో మన ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.