
582views
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యాలో కరోనా తీవ్రంగా ఉన్నా దిల్లీ రానుండటం విశేషం. ఆదివారం రాత్రే రష్యా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి దిల్లీ చేరుకోనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు. అఫ్గానిస్థాన్, ఉగ్రవాదం సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. సదస్సులో మోదీ- పుతిన్లు ఏకాంతంగా చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నాయి.





