
381views
ఇచ్ఛాపురం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొఠియా ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 15 మందికి కొరాపుట్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేసింది. ఈ 15 మంది కొరియా గిరిజనులను ప్రలోభపెట్టి,ఆంధ్రాకు మద్దతు పలకాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో పేర్కొంది. నవంబరు 22న ఉదయం 11 గంటలకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుటహాజరు కావాలని తెలియజేయగా, వీరు హాజరు కాలేదని సమాచారం.





