
722views
-
ఖండించిన తితిదే
తిరుపతి: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కథనానికి, ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి ఫొటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదని, తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉందని టీటీడీ స్పష్టం చేసింది.





