News

కడప.. కన్నీరు!

495views
  • 40 మంది మృత్యువాత

  • 24 మృతదేహాలు లభ్యం

  • మిగతా వాటి కోసం గాలింపు

కడప: ఆంధ్రాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. వరద పోటు వల్ల రోడ్లు, వంతెనలు, పంటలు ధ్వంసమయ్యాయి. మట్టి ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుపాను నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఇంకా కోలుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళకు ఊళ్ళే తుడిచిపెట్టుకుపోయాయి. ఇక కడప జిల్లాలో తుపాను వల్ల ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. రాజంపేట మండలం పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, గుడ్లూరులో 39 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్ల‌డించారు.  24 మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఇందులో ఒకటి గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు చెప్పారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడులో భారీ వర్షాలు

ఇదిలావుండగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులో భారీగా వర్షాలు కురియనున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా పలు చోట్ల రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే శాఖ పలు రైళ్ళను రద్దు చేసింది. నేటి నుంచి తిరిగే చెన్నై సెంట్రల్‌-పీఎస్‌టీ ముంబై రైలును రద్దు చేశారు. ఎల్‌టీటీ ముంబై-చెన్నై సెంట్రల్‌ రద్దు అయ్యింది. అలాగే బిలాస్‌పూర్‌-తిరునల్వేలి రైలు కూడా రద్దు చేశారు. రేపటి గోరఖ్‌పూర్‌-సికింద్రాబాద్‌ రైలు రద్దు అయ్యింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి