News

అత్యాచార నిరోధక చట్టంపై వెనక్కు తగ్గిన పాక్

593views
  • ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ వ్యాఖ్య

ఇస్లామాబాద్‌: రేప్​ కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే ‘నేర చట్టం-2021’ బిల్లుపై పాకిస్థాన్ వెనక్కు తగ్గింది. ఈ చట్టం.. ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్​ కౌన్సిల్ స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ చట్టంలో ఉన్న కెమికల్ ‘కాస్ట్రేషన్​’ క్లాస్​ను తొలగించినట్టు పార్లమెంటరీ న్యాయ కార్యదర్శి జస్టిస్ మలీకా బొకారీ తెలిపారు.

ఈ చట్టంలోని అంశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని అంతర్జాతీయ ఇస్లామిక్​ కౌన్సిల్ స్పష్టం చేయటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యాయశాఖ మంత్రి ఫరోగ్​ నాసిమ్​ ఆధ్వర్యంలో చర్చలు జరిపాకే కెమికల్ ‘కాస్ట్రేషన్​’ అంశాన్ని చట్టం నుంచి తొలగించామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి