News

హనుమాన్‌ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమం

619views
  • హిందువులు మైనార్టీలుగా ఉన్న చోట లౌడ్‌ స్పీకర్ల పంపిణీ

  • సూరత్‌లో శ్రీకారం చుట్టిన భజరంగ దళ్‌

సూరత్‌: హనుమాన్‌ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమానికి భజరంగదళ్‌ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలకు లౌడ్‌ స్పీకర్లను భజరంగదళ్‌ అందిస్తోంది. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఈ పనులకు శ్రీకారం చుట్టింది. రోజుకు రెండుసార్లు హనుమాన్‌ చాలీసా పారాయణానికి దళ్‌ పిలుపునిచ్చింది.

సూరత్‌లో హిందువులు మైనార్టీలుగా 21 ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ హనుమాన్‌ చాలీసాను రోజుకు రెండుసార్లు లౌడ్‌ స్పీకర్లలో, దేవాలయాల నుండి లేదా ఇళ్ల పైకప్పుల నుండి వినిపించనున్నారు. ‘రాబోయే రోజుల్లో.. ఇలాంటివి మరిన్ని ప్రాంతాలలో చూడబోతున్నాం. హిందువులు మైనారిటీలుగా ఉన్న ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. భజరంగ్‌ దళ్‌ ఆమ్ప్లిఫయర్లు, టైమర్‌లతో పాటు స్పీకర్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది… తద్వారా హనుమాన్‌ చాలీసా రోజుకు రెండుసార్లు వినిపించబడుతుంది’ అని భజరంగ దళ్‌ కార్యకర్తలు తెలిపారు.

ఆజాద్‌ నగర్‌లోని కొన్ని ప్రాంతాలలో హిందువులు మైనారిటీలుగా మారారు. గత కొన్నేళ్లుగా జనాభాలో మార్పు వచ్చింది. ఆయా ప్రాంతాల్లో అట్టడుగు కులాల ప్రజలు నివసించేవారు. కొందరు వచ్చి దళితులు హిందువులు కాదని విభజించడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతాల్లో మెల్లమెల్లగా ముస్లింల ఆధిపత్యం మొదలైందని.. హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారని భజరంగ్‌ దళ్‌ నాయకులు తెలిపారు. వాళ్లంతా హిందువులే అని భరోసా ఇచ్చే బాధ్యతను మేం తీసుకున్నామని.. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి