News

భారత్ కరోనా వ్యాక్సిన్‌కు 96 దేశాల ఆమోదం

443views
  • ప్రయాణ ఆంక్షలు తొలగింపు

న్యూఢిల్లీ: భారత్ తయారు చేసిన కరోనా టీకాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎనిమిది వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే అందులో మన కొవిషీల్డ్, కొవాగ్జిన్లు ఉండటం గర్వకారణమని అన్నారు. 96 దేశాలు ఈ రెండు టీకాలను గుర్తించాయని చెప్పారు.

టీకా ధ్రువీకరణ పత్రాన్ని పరస్పరం ఆమోదించుకునేందుకు ఈ దేశాలు అంగీకారం తెలిపాయని.. కొవిన్ యాప్​లో ఈ దేశాల జాబితా ఉందని తెలిపారు. మరిన్ని దేశాల్లో టీకా ధ్రువీకరణ పత్రానికి గుర్తింపు కోసం భారత్ ప్రయత్నిస్తోందని మాడవీయ స్పష్టం చేశారు. భారత టీకాలకు గుర్తింపునిచ్చిన దేశాలకు వెళ్తే ప్రయాణ ఆంక్షలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి