
574views
న్యూఢిల్లీ: భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రస్తుత భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అదే రోజున వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.





