
644views
బెంగళూరు: కేరళలో మావోయిజంతోకూడిన సంఘవ్యతిరేక ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బీజీ కృష్ణమూర్తి, సావిత్రిలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన బీజీ కృష్ణమూర్తి కేరళలోని మావోయిస్టుల నాయకుడిగా భావిస్తున్నారు. కేరళ పోలీస్‌కి చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ వారిని మధురైలో పట్టుకుంది.
వీరిద్దరూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రెండు రోజుల కిందట కన్నూర్‌లో పట్టుబడిన రాఘవేంద్ర అలియాస్ గౌతమ్ నుంచి కృష్ణమూర్తి గురించి పోలీసులకు సమాచారం అందింది. అతడి కోసం సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వాయనాడ్ సరిహద్దు ప్రాంతాల్లో వీరు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Source: Janamonline





