News

ఇప్పుడది అయోధ్య కంటోన్మెంట్‌!

753views
  • ఉత్తరప్రదేశ్‌లో పేరు మారిన రైల్వే స్టేషన్‌

లక్నో: యూపీలోని ఫైజాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు. ఈ మేరకు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం మీదున్న పాత నేమ్‌ బోర్డులను అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు గతంలో అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ముఘల్‌సరయ్‌ రైల్వే జంక్షన్‌ పేరును పండిట్‌ దీల్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గా మార్చడం తెలిసిందే.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి