News

అమెరికాలో అధికారికంగా దీపావళి

658views

మెరికాలోని మిచిగాన్ రాష్ట్ర సెనెట్ హౌస్.. దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయురాలు తెలిపారు. సెనెటర్ జిమ్ రన్ స్టడ్ తీర్మాన్నాన్ని ప్రతిపాదించగా.. మరో సెనెటర్ డేటా పోల్ హంకి మద్దతు తెలిపారు. మంగళవారం సాయంత్రం సెనెట్ హౌస్ ఆ తీర్మాన్నాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా తనతో పాటు మరికొందరు ప్రవాస భారతీయులను స్టేట్ క్యాపిటల్ భవన్ కు ఆహ్వానించారని పేర్కొన్నారు. పండుగలు కుల మతాలకు అతీతమని.. అందరూ కలసిమెలసి ఉండాలన్న సందేశాన్నితెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.