News

అయోధ్యలో ఇసుకతో రామాయణ ఘట్టాలు… దీపావళి సందర్భంగా ఏర్పాటు

594views

దీపావళిని పురస్కరించుకుని అయోధ్యకు చెందిన రూపేశ్ సింగ్ అనే కళాకారుడు ఇసుకతో రామాయణ ఘట్టాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుండటం…. మరోవైపు దీపావళికి ముందు నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య ముస్తాబవుతున్న తరుణంలో ఈ సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన ‘భరత్ మిలాప్’తోపాటు.. రాముడు, లక్ష్మణుడు, సీతకు సంబంధించిన సైకత శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.