News

జపాన్ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

472views
  • చైనా అండదండలతో దుందుడుకు చర్యలు

ఉత్తర కొరియా: చైనా ప్రోద్బలంతో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాట్లాడుతూ ఉత్తరకొరియాలోని ‘పోర్ట్‌ ఆఫ్‌ సిన్పో’ నుంచి దీనిని ప్రయోగించినట్టు పేర్కొన్నారు. ఈ పోర్టులో తరచూ సబ్ మెరైన్లను నిలుపుతుంటారు.

ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్‌ సముద్రంలో పడింది. ఈ నేపథ్యంలో దీనిని సబ్ మెరైన్‌ నుంచి ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్లు ప్రయాణించింది. దీనిపై జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఈ క్షిపణి 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి