News

ఏబీవీపీ త్వ‌ర‌లో ‘వీరు’ల‌ వివ‌రాల సేక‌ర‌ణ‌

635views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో అమ‌రులైన వీరుల వివ‌రాలు సేక‌రించాల‌ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్ణయించింది. ఏబీవీపీ రెండు రోజుల కేంద్ర కార్యవర్గ సమావేశం నిన్న‌ పాట్నాలోని రాణి సతీ మందిర్ గాంధీ మైదానంలో ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ABVP యొక్క CWC ఈ స‌ర్వే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి విలేఖ‌రుల సమావేశంలో ప్రసంగిస్తూ, “భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చాలా మంది హీరోలు పాల్గొన్నారు… కానీ వారి త్యాగానికి తగిన ప్రశంసలు అందలేదు. ఈ 75వ స్వాతంత్య్ర సంవత్సరంలో, ఏబీవీపీ దేశ పౌరుల కోసం అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ‘ అని తెలిపారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి