
618views
-
117 మంది ప్రయాణికులు క్షేమం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. 177 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానం శనివారం విజయవాడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రన్ వేపైనే నిలిచిపోయింది. విజయవాడ నుంచి ఢిల్లీకు బయలుదేరిన ఈ విమానంలో 117 మంది ఉన్నారు. టెక్నకల్ టీమ్ లోపాన్ని సరిజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉదయం ఏడు గంటలకు ఢల్లీి నుంచి విజయవాడకు చేరుకున్న ఈ విమానం తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యకు గురైంది.





