
530views
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ పథకం రైతుల పాలిట ఆశా జ్యోతి కానుంది. అదే “పీఎం – ఆశా” పథకం. రైతులకు, వారి ఉత్పత్తులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ పతాకాన్ని తీసుకొచ్చింది. పప్పులు, నూనె గింజలు పండించే రైతుల ఉత్పత్తులకు సరైన మద్దతు ధర కల్పించడం ఈ పథకంలో ప్రధాన అంశం. ఇక రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను విస్తృతంగా పెంచుతూ, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. ఇందులో భాగంగా… గ్రామీణ ప్రాంతాల్లో గోడౌన్లు, వేయింగ్ బ్రిడ్జ్ లు, రవాణా సదుపాయాలు మెరుగుపర్చాలి.





