
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త అధ్యయనం లిఖించాడు. శతాబ్దం నుంచి అథ్లెటిక్స్‌లో పసిడి కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలను నెరవేర్చి.. భారత్ కు స్వర్ణాన్ని అందించాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా.. వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ ను అందుకున్న అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందుకున్న వీరుడిగా చరిత్ర లిఖించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ప్రస్తాననానికి సరికొత్త బాటలు వేసిన వీరుడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్ చేసి.. పసిడిని పట్టేశాడు.. అయితే తన గోల్డ్ మెడల్‌ను భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు అంకితమిస్తున్నానని నీరజ్ ప్రకటించాడు. గోల్స్ మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ‘దిగ్గజం మిల్కా సింగ్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినాలనుకున్నారు. ఆయన కల నెరవేరింది. కానీ మిల్కా సింగ్ ఇప్పుడు మనతో లేరు.. కనుక తాను ఒలింపిక్స్ లో సాధించిన పసిడి పతకాన్ని మిల్కా సింగ్ కు అంకితం ఇస్తున్నానని తెలిపాడు. అంతేకాదు మిల్కా సింగ్ ఎక్కడ ఉన్నా.. తనను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు అనుభూతి చెందుతున్నట్లు చెప్పాడు.





