News

పాకిస్తాన్లో ఆలయ విధ్వంసంపై ఆ దేశ సుప్రీంకోర్టు అసహనం.. అధికారుల తీరుపై ఆగ్రహం

473views

పాకిస్థాన్​లో హిందూ ఆలయంపై జరిగిన దాడులకు సంబంధించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఈ ఘటన.. పాకిస్థాన్​ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించింది.

దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న హిందూ కుటుంబాల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చామని అధికారులు ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాడిని కట్టడి చేయలేని అధికారులను తొలగించాలని సూచించింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసును పాక్​ సుప్రీంకోర్టు.. సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.