News

బంగ్లాదేశ్లో వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

584views

వెయ్యేళ్ల నాటిదిగా భావిస్తున్న శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహాన్ని ఓ ఉపాధ్యాయుడి నుంచి బంగ్లాదేశ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి ‘ది డైలీ స్టార్‌’ పత్రిక వెల్లడించింది. 12 కిలోల బరువు, 23 అంగుళాల ఎత్తు, 9.5 అంగుళాల వెడల్పు ఉన్న ఈ విగ్రహం అబూ యూసఫ్‌ అనే ఉపాధ్యాయుడికి నెలన్నర క్రితం దొరికిందని, అయితే అతడు దాని గురించి తమకు తెలియజేయలేదని పోలీసులు చెప్పారు.

అతడి ఇంటి నుంచి సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెరువు నుంచి మట్టిని తవ్వుతుండగా తనకు ఆ శిల్పం దొరికిందని, పనితో తీరిక లేక పోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వలేదని యూసఫ్‌ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.