తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం తజికిస్థాన్‌లోని దుశాన్‌బేలో జరుగుతోంది.
ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటున్నారు.
వార్షిక సమావేశంలో, SCO సభ్య దేశాలలో రక్షణ సహకార సమస్యలు చర్చించబడతాయి. ఈ చర్చల తరువాత ఒక ప్రకటన జారీ చేయబడుతుందని భావిస్తున్నారు.
ఈ రోజు సమావేశం సందర్భంగా, సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా, శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులు పునరుద్ఘాటించారు. బెలారస్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ విక్టర్ క్రెనిన్ ను కూడా మన రక్షణమంత్రి కలిశారు. ఈ ఉదయం, దుశాన్‌బేలోని సోమోని స్మారక చిహ్నం వద్ద రక్షణ మంత్రి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
తన మూడు రోజుల దుషాన్బే పర్యటనలో, రాజ్నాథ్ సింగ్ తజకిస్థాన్ కల్నల్ జనరల్ షెరాలి మిర్జోను కలుసుకుని ద్వైపాక్షిక సమస్యలు మరియు పరస్పరం అవసరమైన, ఆసక్తి కలిగిన ఇతర సమస్యలపై చర్చించనున్నారు. SCO సభ్యదేశం తజకిస్థాన్ ఈ సంవత్సరం సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు, అధికారిక స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తోంది.





