
529views
శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నారో మహిళ. ఆమె మధ్యలో తప్పు పలికగా ఆపరేషన్ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగింది.
‘క్రేనియోటమీ’ శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఎడమ వైపున కణతిని తొలగించారు. అనంతరం ఆమె ఏమీ కానట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఫోన్ రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.





