
363views
ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్లు విరుచుకుపడ్డాయి. బుధవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్ సైన్యం పేర్కొంది. రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని, దాడి జరిగిన ప్రదేశం ధ్వంసమైందని వెల్లడించింది. కాగా బుధవారం ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్, డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇరాన్ మద్దతుదారులు చేశారని అమెరికా ఆరోపించింది. ఆ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది.





