News

వాయుసేన అమ్ములపొదిలో ఆకాశ్ క్షిపణులు..

620views

భారత వైమానిక దళానికి ఆకాశ్ క్షిపణులను సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఒప్పందం చేసుకుంది. రూ. 499 కోట్ల విలువైన భారత వైమానిక దళం ఎయిర్ కమోడోర్ అజయ్ సింఘాల్, బీడీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమాండర్ టి. ఎన్. కౌల్ గురువారం దిల్లీలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్ర మాట్లాడుతూ భారత, వైమానిక దళానికి తమ సంస్థ ఆకాశ్ క్షిపణులను సరఫరా చేస్తుందని తెలిపారు.

వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. 2021-21 ఆర్థిక సంవత్సరంలో బీడీఎల్ రూ. 2,803 కోట్ల విలువైన ఆర్డర్లను పొందిందన్నారు. ఇందులో రూ.1,820 కోట్ల విలువైన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, రూ. 793 కోట్ల విలువైన ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల ఆర్డలు ఉన్నాయని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.