News

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్

770views

భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది దుర్ఘటనలకు దారి తీసే అవకాశం ఉందని రావత్‌ అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని ఇరు పక్షాలకు తెలుసన్నారు.

భారత సైన్యం అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్న రావత్‌.. ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా స్పందించాలని వ్యాఖ్యానించారు. భారత్‌-చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని తెలిపారు. సరిహద్దుల్లో భారత్‌ భారీగా దళాలను మోహరించిందని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.