News

భారీగా క్షిపణులు పోగేస్తున్న చైనా… భారత్, అమెరికాలతో పోరాడటానికే అంటున్న నిపుణులు

472views

చైనా తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను దాచి ఉంచేందుకు వీలుగా కొత్తగా 119 టవర్ల వంటి నిర్మాణాలను (సిలోలు) ఏర్పాటు చేసుకుంటోంది. బీజింగ్ కు దాదాపు 2,100 కిలోమీటర్ల దూరంలో, గాన్సూ ప్రావిన్సులోని ఓ ఎడారిలో వాటన్నింటినీ ఒకే ఆకృతిలో నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా స్పష్టమవుతోందని అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది.

భారత్ సహా, అమెరికా ప్రధాన భూభాగాలను తాకగల శక్తిమంతమైన ఆయుధాలను ఈ టవర్లలో ఉంచే అవకాశముందని ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. డ్రాగన్ వద్ద ఇప్పటికే 250-350 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనాలున్నట్లు గుర్తుచేసింది. కొత్తగా ఎన్ని క్షిపణులను సమకూర్చుకొని.. ప్రస్తుతం నిర్మిస్తున్న టవర్లలో భద్రపరుస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.