News

హిందూ సంస్కృతిని కించపరిచిన తృణమూల్ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే రాజీనామా చెయ్యాలి : భాజపా డిమాండ్ : స్పీకర్ కు ఫిర్యాదు

532views

భారతీయ సంస్కృతిని అవమానించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. నుదుట సింధూరం పెట్టుకున్న నస్రత్ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని తన భర్తగా పేర్కొంటూ వివాహ విందు ఏర్పాటు చేశారని, దానికి సీఎం మమతను కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో అతడితో తనకు పెళ్లే జరగలేదని చెబుతున్నారని, ఇది భారతీయ సంస్కృతిని అవమానించడమేనని అన్నారు. ఆమె కనుక తన పదవికి రాజీనామా చేయకుంటే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

దీనిపై ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య మంగళవారం లోక్ సభ సభాపతి ఓం బిర్లాకు ఓ లేఖ వ్రాశారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ నస్రత్ జహాన్‌ తన వైవాహిక హోదా గురించి పార్లమెంటుకు తప్పుడు ప్రమాణ పత్రాన్ని సమర్పించారని తెలిపారు. ఆమెను ఆ పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ‌ను టర్కీలో వివాహం చేసుకున్నట్టు గతంలో ప్రకటించిన నస్రత్.. ఇటీవల తమ బంధం దెబ్బతిన్నట్టు ప్రకటించినప్పటి నుంచి రాజకీయంగా వివాదం చుట్టుముట్టింది. నస్రత్ జహాన్ జూన్ 9న విడుదల చేసిన ప్రకటనలో తనకు నిఖిల్ జైన్‌తో వివాహ బంధం దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఆమె బసీర్‌హట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నిఖిల్ జైన్ ‌తో తన వివాహం టర్కిష్ వివాహ నిబంధనల ప్రకారం టర్కీలో జరిగిందని, దానిని భారత దేశంలో రిజిస్ట్రేషన్ చేయించలేదని, అందువల్ల తమ వివాహం భారత దేశంలో చెల్లుబాటు కాదని వివరించారు. నిఖిల్ జైన్ ‌తో టర్కీలో వివాహమైందని చెప్తూ, కోల్‌కతాలో విందు ఇచ్చారు. ఈ విందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా హాజరయ్యారు. పైగా నస్రత్ జహాన్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని నిఖిల్ జైన్ చెప్తూండడం కొసమెరుపు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.