News

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మరో అడుగు – అక్కడి రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడనున్న మోడీ, అమిత్ షా

420views

మ్ముకశ్మీర్​లోని వివిధ రాజకీయ పార్టీలతో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించనున్నారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే.

ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర నాయకులు హాజరవుతారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్ లోనె తదితరులు చర్చల్లో పాల్గొనేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.