మనిషి తన కోరికలను నియంత్రించుకోవటమే ఏకాత్మ మానవ దర్శనం : శ్రీ భాగయ్య గారు : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ .

ఏకాత్మ మానవతా వాదం
వక్త: మాననీయ శ్రీ భాగయ్య
ఆరెస్సెస్ అఖిల భారత సహ సర్ కార్యవాహ
వేదిక : శ్రీ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజి ఆడిటోరియం.
అధ్యక్షులు, గౌరవనీయులు ప్రొ|| ఎల్. ఎస్ రెడ్డి గారు, దీన దయాళ్ పరిశోధనా సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ అతుల్ జైన్ గారు, సమాలోచన అధ్యక్షులు ప్రొ|| రామచంద్రుడు గారు, సోదరీమణి శ్రీమతి మసుమా రిజ్వీ గారు,కూనే లక్ష్మయ్య కళాశాల అధ్యక్షులు గౌరవనీయులు సత్యనారాయణ గారు పెద్దలారా! మాత్రుమూర్తులారా! సోదర సోదరీ మణులారా!
ఎవరి దగ్గరైతే నేను పెరిగి నేర్చుకున్నానో, ఎవరి చేతి అన్నం తిని పెరిగానో ఆ పెద్దలు, మాత్రుమూర్తులు, సోదరీమణులు అందరూ ఇక్కడ ఉపస్థితులై వున్నారు. వారందరికీ పేరు పేరునా నా నమస్కారాలు.
ఈ రోజు శ్రీ రామ నవమి. అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. శ్రీ సీతా రామ కళ్యాణం ఈరోజు భద్రాచలంలో జరుగుతోంది. మేము నిన్ననే హైదరాబాదులో శ్రీ సీతా రామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని వచ్చాం.
మాన్యులు దీనదయాళ్ జీ, మాననీయ నానాజీ ఆధునిక రుషి పరంపరకు చెందిన వారు. వారిద్దరూ భారతదేశం యొక్క ప్రాచీన పరంపరను, మానవ జీవితం సుఖంగా, ఆనందంగా జీవించటానికి కావలసిన విషయాన్ని దర్శించారు, అనుభూతి చెందారు, వ్యాఖ్యానం చేశారు. సత్యమొక్కటే. ఆ సత్యము శాశ్వతమైనది, చిరంతనమైనది. ఆ సత్యాన్ని దర్శించి, అనుభూతి చెంది, ప్రజా జీవితంలో వ్యాఖ్యానించారు. కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా మానవ సమాజానికి, యావత్ సృష్టికి కావలసిన దానిని వ్యాఖ్యానం చేశారు మాన్యులు దీనదయాళ్జి.
“ యద్దేశస్య యో జంతు: తద్దేశస్య తదౌషదం|”
“ఒకే దేశంలో ఉన్నంత మాత్రాన అచ్చటి పశువులు, మనుషులు, రోగులందరికీ ఒకే ఔషదం, ఒకే నినాదం పనికిరాదు” అంటారు దీనదయాళ్జీ. ఈ అంశమే ఏకాత్మ మానవ దర్శనంలో ప్రధానమైనది. పెద్దలు ప్రశాంత చిత్తంతో ఆలోచించవలసిందిగా మనవి. మనందరం ఇప్పటికే ఒక విష వలయంలో చిక్కుకున్నాం.
నేను ఆరంభంలో శ్రీ ఎల్.ఎస్. రెడ్డి గారితో విభేదించాను. వారు ఆంగ్లంలో మాట్లాడుతున్నందుకు. అట్లని నేను ఇంగ్లీషు వ్యతిరేకిని కాదు. నేను అమెరికాలో పర్యటన చేసిన సందర్భంలో నేను ఇంగ్లీషులోనే మాట్లాడుతాను. అయితే ఆంగ్లము మాట్లాడితేనే గాని మేధావి కాదనే భ్రమ ఇపాటికీ మనలో వుంది. ఆంగ్ల భాష రాకపోతే విజ్ఞాన శాస్త్రవేత్త కాలేడనే భ్రమ వుంది. ఇది పూర్తిగా అసత్యము.
అన్ని భాషల లాగా ఆంగ్ల భాష కూడా చాలా గోప్పది. కానీ ప్రపంచం మొత్తంలో అత్త్యుత్తములైన వైజ్ఞానికులు పొరపాటున కూడా ఆంగ్లంలో మాట్లాడరు. ఉదా: ఇజ్రాయెల్ వారు, ఫ్రాన్స్ వారు, జర్మనీ వారు…. వైజ్ఞానికులలో వీరందరి తర్వాతి స్థానమే ఇంగ్లాండ్ ది. మనం భావ దాస్యంలో బ్రతుకుతున్నాం. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. మాన్యవర దీనదయాళ్జీ, మాననీయ నానాజీ దేశముఖ్ లకు ఈ దిశనిచ్చింది పూజ్య గురూజీ. వారికి దిశనిచ్చింది ఈ దేశం యొక్క పరంపర, వేదము, ఉపనిషత్తులు.
న్యూటన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడంటారు. న్యూటన్ పుట్టకముందు, న్యూటన్ కనుగొనకముందు భూమికి ఆకర్షణ శక్తి లేదని ఎవరైనా అంటారా? ఎంతటి అవివేకమౌతుందది? భూమ్యాకర్షణ సిద్దాంతం శాశ్వతమైనది. దానిని బోదాయనుడు కావచ్చు, న్యూటన్ కావచ్చు కనుగొని ప్రచారంలోకి తెచ్చారు.
సృష్టి, మానవ జీవితం శాశ్వతమైనవి. శాశ్వతమైన మానవ జీవితాన్ని సుఖంగా, ఆనందంగా సాగించడం ఎలా? ఇది ప్రముఖమైనది. మనందరి అదృష్టమేమిటంటే మాననీయ దీనదయాళ్జీ 1964లో ఇదే విజయవాడలో శాశ్వతమైన, మానవాళికి మార్గాదర్శియైన ఏకాత్మ మానవతా వాదాన్ని ప్రవచించి సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలలో ప్రపంచానికి మార్గదర్శనం చేశారు దీనదయాళ్జీ. వారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి కాదు.ఎందుకంటె అనాదిగా ప్రజాస్వామ్యం పరిడవిల్లిన దేశం మనది. హర్షవర్ధనుడు మన దేశంలో ప్రజాస్వామ్య పద్దతిలో పరిపాలన సాగించాడు. పెట్టుబడిదారీ విధానము, సామ్యవాదము వగైరాలు అనేకమందికి సుళువుగా తెలుస్తాయి. వీటి ప్రయత్నం కారణంగా, గడచినా వెయ్యి సంవత్సరాల కాల ఖండంలో ఈ ప్రపంచంలో శాంతి స్థాపన పేరుతో జరిగిన అనేక ప్రయత్నాల కారణంగా నేడు ప్రపంచంలో గ్లోబల్ యూనిటీ బదులుగా గ్లోబల్ టెర్రరిజం కనబడుతోంది. ప్రపంచం అతలాకుతలమైపోతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా మన దేశంలో పరిస్థితి కొంత ఫర్వాలేదు. వాతావరణం బాగుండాలని ప్రయత్నం చేస్తూంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. మేథావులంతా తలలు పట్టుకుంటున్నారు. ఆర్ధిక స్వావలంబన, సౌఖ్యం బదులుగా గ్లోబల్ రెసిషన్ కనబడుతోంది. ప్రపంచంలో అనేక దేశాలు అనేక దేశాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి. మానవాళికి శాంతి యెట్లా? మానవాళికి సుఖము, శాంతి కలగాలి. మన దేశంలో నేడు చాలా అంశాల్లో మార్పు వచ్చింది. ఇంకా చాలా అంశాల్లో మార్పు రావాలి. మొఎలికమైన విషయాలలో మార్పు అవసరం. 1964లో పెద్దగా పేరు ప్రతిష్టలు లేని సమయంలోనే మెజారిటీ, మైనారిటీ తో సంబంధం లేకుండా ఏది సత్యమో, ఏది శాశ్వతమో, ఏది చిరంతనమో నొక్కి వక్కాణించారు మాననీయ దీనదయాళ్జీ. ప్రతి రాష్ట్రానికి [దేశానికి] ఒక ‘చితి’ వుంటుంది. ఈ చితి ప్రణాళికలతో, ప్రక్రియలతో కాకుండా జన్మ సిద్దంగా వస్తుంది. చారిత్రిక క్కరణాల వల్ల కాదు. జన్మసిద్దంగా, ప్రకృతి సిద్దంగా మనకు [ఈ జాతికి] ఒక చితి వున్నది.
రామాయణ యుద్ద సమయంలో విభీషణుడు రాముని ప్రక్కన చేరడం ద్వారా భ్రాత్రు ద్రోహి, దేశ ద్రోహి అయినాడు. కానీ ఎవరూ విభీశానున్ని అలా అనటం లేదే? ఎందుకంటే ఇది మన చితి. మన జాతి యొక్క ఆత్మ. కృష్ణుడు స్వయంగా తన మేనమామను సంహరించాడు. కానీ ఎవ్వరూ తప్పు పట్టటం లేదు. మహాభారత సంగ్రామాన్ని రాజకీయ పోరాటంగా ఎవ్వరూ చూడటం లేదు. ధర్మాధర్మాల మధ్య యుద్ధంగా చూస్తున్నాం. సామాన్యులు కూడా ఆ యుద్దంలో ధర్మమే గెలిచిందంటారు. పామరులు కూడా… అక్షరాస్యులందరూ విద్యావంతులని అర్థం కాదు. విద్యావంతుడే, జ్ఞానే అయినా అక్షరాస్యుడయ్యుండాల్సిన అవసరం లేదు. “ All literary people need not be educated. All illiterate people not needed be uneducated.” ధర్మం వైపు నిలిచాడు గనుక మనం ధర్మరాజును గౌరవిస్తాం. దుష్టుడు కనుక దుర్యోధనుణ్ణి వ్యతిరేకిస్తాం. ఇది మన జాతి యొక్క చితి. “ది టామ్ అఫ్ ఫిజిక్స్ బై డాక్టర్ కాప్రా ఫ్రిజడిస్, ఏ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ బీఇంగ్స్ బై పామెల్లా పోర్చుగల్, ది రూట్స్ అఫ్ కన్సెంట్ బై రోస్టర్, నథింగ్ బై ఛాన్స్ బై రిచర్డ్ బోర్న్, రిలేటివిటీ థియరీ, క్వాంటం మెకానిజం వంటి పుస్తకాలు చదివే వుంటారు. డాక్టర్ కాప్రా ఏం చెప్పాడంటే 17 వ శతాబ్దానికి ముందు I. Q [ Intelligent quotient] మాత్రమే గొప్పది అని ప్రచారం చేశారు. అంతఃస్ఫూర్తికి, జ్ఞానానికి బదులు బుద్దిబలమే గొప్పదని ప్రచారం చేశారు. ఒక శతాబ్దం తర్వాత I.Q వుంది దానితోపాటు E. Q [ Emotional quotient] [భావావేశం] కూడా వుంది అని అంగీకరించారు. 19వ శతాబ్దం నాటికి I.Q, E,Q తోపాటుగా S.Q [Spiritual quotient] ని కూడా అంగీకరించారు. I.Q, E.Q కంటే S.Q,అంటే ఆధ్యాత్మిక భావన ప్రధానమైనదని ప్రపంచం నేడు అంగీకరిస్తున్నది. దీనిని అంగీకరించిన తర్వాత భారతీయమైన, ప్రాచీనమైన వైజ్ఞానిక పరంపర ఆధారంగా వుండే విజ్ఞానము, శాస్త్రము మనకర్ధమవుతుంది. పాశ్చాత్యుల అవగాహనలో వ్యక్తి, కుటుంబం, సమాజం, జాతి ప్రపంచం, విశ్వం వేరు వేరుగా వుంటుంది. అదే భారతీయుల దృష్టి కోణంలో వ్యక్తి కేంద్రంగానే కుటుంబం, సమాజం, జాతి, ప్రకృతి, ప్రపంచం, విశ్వం, పరమేష్టి. వ్యక్తి యొక్క పరిధి దశల వారీగా విస్త్రుతమవుతోంది.
“ వ్యక్తికి స్వాతంత్ర్యం తోపాటుగా సంమజిక అనుశాసనం కూడా కావాలి” అని మాననీయ దీనదయాళ్జీ చెప్పారు. వ్యక్తి స్వేచ్చ పేరుతో మనం సామాజిక అనుశాసనాన్ని కోల్పోతున్నాం. వ్యక్తిగత పోటీకి ప్రేరణ వుండాలి. కానీ సమతా వాడ భావన ఆధారంగా వుండాలి. వ్యక్తిగత వికాసముండాలి. సామాజిక న్యాయముండాలి. మన దేశంలో ప్రస్తుతం సామాజిక న్యాయం లేదు, కొందరి వ్యక్తిగత వికాసం మాత్రం వుంది. దానికి బాధ్యులందరూ దండనీయులే, శిక్షార్హులే. నిత్య జీవితంలో ఇమిడియున్న మౌళిక ఏకత్వము, బాహ్యంగా కనిపించే వైవిధ్యము. జాతీయ, అంతర్జాతీయ వాదాల మధ్య సంఘర్షణ లేదు. వివిధ రకాలైన IDENTITY [ అస్థిత్వము] సామాజిక ఎకాత్మతకు భంగం కారాదు. అనుశాసనం పెవ్రుతో స్వేచ్చను హరించరాదు. WE WANT UNITY BUT NOT UNIFORMITY. ఏకత కావాలి కానీ ఏక రూపత కాదు. ఏ దేవుడినీ పూజించక పోయినా మోక్షం సిద్దిస్తుంది. ఇదే భారతీయ చింతన. ఏ దేవుడినీ పూజించకపోయినా సత్కర్మ, సదాచారము వలన మోక్షము, శాంతి లభిస్తుంది అన్నదే భారతీయ చింతన. ప్రభుత్వ శాసనమున్డాలి. ప్రభుత్వానికి దాసులం కారాదు. ప్రభుత్వం ప్రజలకు దాసుడు కావాలి, సేవలు చెయ్యాలి. పట్టణ ప్రాంతాల యొక్క వికాసం జరగవచ్చు, సాంస్కృతిక పరిరక్షణ జరగాలి. గ్రామాలను ఎడారులుగా చెయ్యకూడదు.
మాననీయ దీనదయాళ్జీ తత్వ చింతన తోపాటుగా దానిని దర్శించారు. మొదట మనిషి – శరీరము – బుద్ది – మనస్సు – ఆత్మ ఇది సమగ్రమైనది.
ఉదా: నేను విజయవాడ నుంచి తెనాలికి పినాకినిలో వెళ్తూ వున్నాను. చల్లటి గాలి, నిద్రొస్తోంది. నా ఎదురుగా ఒక మహిళ పంజాబీ డ్రస్సులో… ఆమె ప్రక్కన ఇద్దరు పెద్ద వయసు మాత్రుమూర్తులున్నారు. పంజాబీ డ్రస్సులో వున్న అమ్మాయి నిద్రలో జోగుతూ రైలు కృష్ణా కెనాల్ దాటుతూన్న సమయంలో దబ్ అని శబ్దం చేస్తూ పడిపోయింది. పెద్ద వయసు స్త్రీలిద్దరూ ఆ అమ్మాయిని లేపి కూర్చోబెట్టారు. “సరిగా కూర్చోమ్మా పడిపోతావు” అన్నారు. కొద్ది దూరం ముందుకెళ్లాక ఆ అమాయి మళ్ళీ పడిపోయింది. మళ్ళీ వాళ్ళే లేపి కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి మళ్ళీ పడిపోయింది మూడోసారి. “అమ్మాయీ ఇలా అయితే ఎలా? పది ఏదన్నా దెబ్బ తగిలితేనో?” అన్నారు వారు. “మూడ్రోజులుగా నిద్ర లేదాంటీ” అందా అమ్మాయి. “ఏమైంది తల్లీ?” అని అడిగారు వారు ఆత్రుతగా. ఆ అమ్మాయి చెప్పిందీ…. “ మూడ్రోజులుగా టీ.వీ చూస్తూనే వున్నానాంటీ” అని చెప్పింది. అందుకే దీనదయాళ్జీ ‘ నువ్వు చేసే ప్రతి పని వల్ల ణీ శరీరానికి, బుద్దికి, మనస్సికి, ఆత్మకి సుఖము కలిగితేనే చెయ్యమ’ని చెప్పారు. ఏకాత్మ మానవ దర్శనమంటే కేవలం ఆర్ధిక విషయాలు కాదు. వ్యక్తి యొక్క సమగ్ర వికాసం జరగాలి.
ఉదా: రష్యా సరిహద్దుల్లో రష్యా కుక్క, ఇండియా కుక్క కలిశాయిట. రష్యా కుక్క పుష్టిగా వుంది. ఇండియా కుక్క బక్క చిక్కి వుంది. ఇండియా కుక్క “ ఆహా నువ్వెంత పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నావో కదా?” అన్నది రష్యా కుక్కతో. అప్పుడు రష్యా కుక్క చెప్పిందిట “నిజమే నేను పుష్టిగా వున్నాను. కానీ ఇక్కడ నాకు మొరిగే అధికారం లేదు.” అని.
అలాగే మనిషి మనసుకి కూడా ఒక గౌరవం కలగాలి. ఒక ఆనందం కలగాలి. వివేకముండాలి. శరీరానికి, మనస్సుకి, బుద్దికి, సమన్వయం కలిగినప్పుడు ఆత్మకి తృప్తి కలుగుతుంది.
“ఆకలేస్తే తినటం ప్రకృతి. పదిమందిని కొట్టి లాకుని తింటే వికృతి. ఆకలేస్తోంది. అయినా నా దగ్గర ఉన్నది పదుగురికి పంచి తినడమే సంస్కృతి” అన్నారు దీనదయాళ్జీ. భారతీయ సంస్కృతి త్యాగము, సమర్పణపై ఆధారపడి వుంది. ఇవ్వడంలో తృప్తి వుంటుంది. పుచ్చుకోవడంలో కాదు. కానీ రాజకీయ నాయకులు మనకు పుచ్చుకోవడం మాత్రమే నేర్పారు. శరీరం, మనస్సు, బుద్ది, ఆత్మ, ఇదే వ్యక్తి.
అయితే వ్యక్తి ఒంటరి వాడు కాదు. పాశ్చాత్య జీవితాల్లో వ్యక్తి ఒంటరి వాడిన కారణంగా, వ్యక్తి కేంద్రంగా జీవితం నడుస్తున్న కారణంగా వ్యక్తులలో అహంకారం పెరిగి వ్యక్తులు, కుటుంబం మధ్యన సంఘర్షణ వస్తోంది.అందుకే కుటుంబాలు విడిపోతున్నాయి. డబ్బులో పడి అశాంతి మొలకెత్తుతోంది. కానీ మన సమాజంలో వ్యక్తి, కుటుంబం, వేరువేరు కాదు. కానీ దురదృష్టం, పాశ్చాత్య ప్రభావం వల్ల మన కుటుంబాలు కూడా చితికి పోతున్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, ఢిల్లీ లాంటి చోట్ల విడాకుల కేసులే కోర్టుల్లో ఎక్కువున్నాయి. అందరూ చదువుకున్న వాలే. లక్షలు సంపాదించే వాలే. కేవలం ఈగో కారణం. కుటుంబమంటే డబ్బు కాదు. కుటుంబమంటే భౌతిక సుఖం కాదు. కుటుంబం ఒక బాంధవ్యం. మనం పుట్టాక పేరు పెట్టకముందు మనకు, మన తల్లిదండ్రులకు మాత్రమే సంబంధం. పేరు పెట్టక మన బంధువులతో, మన తాత ముత్తాతలతో దేవీ దేవతలతో,సమాజంతో, సంబంధమేర్పడుతుంది. దేశంతో, చరిత్రతో సంబంధమేర్పడుతుంది. కుటుంబం, వ్యక్తి యొక్క వికాసం కోసం సర్వస్వమూ సమర్పణ చేసి ప్రేమతో పని చేస్తుంది. వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుని, తన వికసించిన వ్యక్తిత్వంతో తన కుటుంబానికి తను ఆధారమౌతాడు. సమర్పించుకుంటాడు. ఇక్కడ వ్యక్తి, కుటుంబం మధ్య పరస్పర సంఘర్షణకు తావు లేదు. ఇవి రెండూ పరస్పర పూరకాలు. Both complimentary & supplementary. అందుకే మన కుటుంబాలు ఇంకా బ్రతికున్నాయి. మన సమాజంలో మానవాళికాధారం వ్యక్తి కాదు. కుటుంబము. Villages are extended families. విస్త్రుతమైన కుటుంబాలే గ్రామాలు. నేడు గ్రామాల్లో కుటుంబాలున్నాయి. గ్రామాల్లో కుటుంబ భావన పోయింది. కానీ అనాదిగా మన సమాజంలోని వివిధ వృత్తుల వారికందరికీ తగిన గౌరవం వుంది. ఋగ్వేదంలో అన్ని వృత్తులకు నమస్సులు తెలిపే శ్లోకం వుంది. వ్యక్తి,కుటుంబము, వృత్తుల మధ్య పరస్పర సంబంధముంది.
ఈ మధ్య దర్మం అనే పదాన్ని సంప్రదాయం అనే అర్థంలో వాడుతున్నారు. అయితే ధర్మమూ, సంప్రదాయము ఒక్కటి కాదు. ఆంగ్ల భాషలో ధర్మమూ అను శబ్దానికి సమానమైన పదం లేదు. ఉపాసన – RELIGION వుంది.
“ధారణాత్ ధర్మ ఇతాహు: ధర్మో ధారయతి ప్రజా:”
మనందరినీ కలిపి వుంచేది ధర్మము. సభా ధర్మము, కుటుంబ ధర్మము….
ధర్మము అంటే RULE OF LAW. నా ఇష్ట ప్రకారం చేస్తానంటే అది ధర్మం కాదు. ‘నా మతమే గొప్పది, నా మతంలో ఉంటేనే నీకు మోక్షమొస్తుంది, నీ మతములో వుంటే నువ్వు నరకానికి పోతావు” అనటం అధర్మం.
ఒక ఉపాధ్యాయుడు, ఉద్యోగి, వ్యాపారికి వచ్చే జీతం, లాభం మీ శ్రమకు లభిస్తున్న ప్రతిఫలం కాదు. మీ వల్ల సమాజానికి ప్రయోజనం కలుగుతుంది కనుక, ఉన్నతి లభిస్తుంది కనుక దానికి ప్రతిగా మీరు గౌరవంగా జీవించడం కోసం మీ శ్రేయస్సు కోసం సమాజం మీకిస్తున్న ఫలితం. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేదు. ధర్మం ఆధారంగా జీవిస్తే సంఘర్షణ లేదు. సమాజం మనది. సమాజం లేకుండా మనం లేము. మనము, సమాజము పరస్పర పూరకము. మనం మన మాన సంరక్షణ కొరకు బట్టలు ధరించాం. అనేక దారాలు కలిపి ఈ బట్టలయినాయి. అవే దారాలు విడివిడిగా వుంటే మన మాన సంరక్షణ జరుగుతుందా? దారము వ్యక్తి, గుడ్డ సమాజము. మనం ఒక సమాజంగా కలిసిసి జీవించాలి.
ఈ సృష్టి మొత్తం ఒకే భగవత్ తత్వం నుంచి అబివ్యక్తీకరించబడినదని మన ప్రాచీన ఋషి పరంపర చెబుతోంది. “ It is the manifestation of same divinity”. ఇది అందరూ అంగీకరిస్తున్న సత్యము. Matter will be transformed it will not be destroyed. సృష్టి అంతా ఒకే తత్వము నుండి సృష్టించబడింది. సృష్టి మొత్తంలో ఒకే divinity, ఒకే దైవాంశ, ఒకే తత్వము, ఒకే పదార్ధము వుంది. “ Diversity is the beauty of the nature”. వైవిధ్యము ప్రకృతి యొక్క సౌందర్యము. “ Diversity is not enemasity. Enjoy the diversity”. వైవిధ్యంలో ఎక్కత్మ మానవ దర్శనమే హైందవ చింతన, మానవ చింతన. మ్మనవ సంక్షేమానికి, సృష్టి సంక్షేమానికి అపకారం చెయ్యనంతవరకు వైవిధ్యాన్ని అంగీకరించాలి.
ఏకాత్మ మానవ దర్శనం చేయవలసిన బాధ్యత మనిషిది. మనిషి ఎప్పటివరకు ఏకాత్మను దర్శించడో, అప్పటి వరకు మానవ జాతికి సుఖ, శాంతులు లభించవు. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. కుటుంబాన్ని ప్రేమించాలి. గ్రామాన్ని, దేశాన్ని ప్రేమించాలి. ఇది ఏకాత్మ మానవ వాదం కాదు. ఏకాత్మ మానవ దర్శనమిది. పరివర్తన రావలసింది మనిషి యొక్క ఆలోచనలో. ఏకాత్మ మానవ దర్శనం ఆధారమైన నాడు సృష్టి మొత్తంలో సంఘర్షణ లేదు. సహకారం మాత్రమే వుంటుంది.
సృష్టి మొత్తం మానవుని సౌఖ్యం కోసమే, భోగం కోసమే అని ప్రచారం చేశారు. గతంలో ఏం చేపారంటే “ The individual or the society or the community or the country which exploits the nature as much as they can those are the most intelligent fellows’. అని చెప్పారు. అందుకే జల కాలుష్యము, వాయు కాలుష్యము, వాతావరణ కాలుష్యము మొత్తం అంతా.
“ ఈ ప్రకృతి మనిషి యొక్క భోగం కోసం కాదు.” ప్రకృతి లేకుండా మనందరి మనుగడ లేదు. ఈ విషయాన్ని దీనదయాళ్జీ చెప్పారు. ప్రకృతిని దోచుకోకూడదు. ప్రకృతితో సహజీవనం చెయ్యాలి. ప్రకృతి మనిషి యొక్క భోగం కోసం కాదు. ప్రకృతి మనిషి యొక్క సంరక్షణ కోసం. నేను వాషింగ్టన్లో ఒక పెద్ద ఎగ్జిబిషన్లో చూశాను. “ Earth is not just a piece of land. It’s our mother. Nurture it, Nurture it, Nurture it. Don’t exploit it.” అని వ్రాసివుంది. లోపలి వెళ్లాను “ Water is not just made of H2O. It will more for your life”. అని వ్రాసివుంది. ఇది భారత దేశమా? అమెరికానా? అని ఆశ్చర్యపోయాను. అమెరికా, రష్యా, చైనాల్లో ఈరోజు ప్రకృతిని దోచుకోకూడదని భావిస్తున్నారు. ఈ స్పృహ మన గ్రామీణులకు ఎప్పటినుంచో వుంది. మన చదువు ఆ విధమైన సంస్కారాన్ని ఇవ్వడం లేదు. ప్రకృతితో సహజీవనం చెయ్యాలి. బోష్టన్ సిటీలో టోరో అనే అతను చెప్పినది “The individual or the community or the society which wants to exploit the nature, nature will wipe out that entire community.”
మళ్ళీ అతనే “Nature can fulfill the needs of the land and humanity. But not the desires.” మనిషి తన కోరికలను నియంత్రించుకోవటమే ఏకాత్మ మానవ దర్శనం. దీనదయాళ్జీ గురించి చెప్పుకోవటం, సినిమా చూడటం చేసినంత మాత్రాన సరిపోదు. ఈరోజు ప్రపంచమంతా మన యోగా, మన భగవద్గీత, మన సంస్కృతి వైపు చూస్తోంది. కానీ ఈరోజు అమెరికా కంటే మన సమాజం ఎక్కువగా దిగజారిపోయింది. Intellectual dishonesty వుంది మన దగ్గర. మన నీతులు గొప్పవి, మన ఆచరణ నీచమైపోయింది. వ్యక్తి, కుటుంబము, సమాజము, ప్రకృతి Extended circles. ఒకదానికొకటి సంబంధం కలిగి, అంతర్భాగమై వున్నాయి. మన సమాజము, దేశము, అనంత విశ్వంలో అంతర్భాగమైనపుడు ఈ ప్రపంచం నుంచి, విశ్వం నుంచి ఎలా వేరు పడుతుంది? జాతీయ, అంతర్జాతీయ వాదాల మధ్య సంఘర్షణ లేదు. ప్రపంచంలో ఎక్కడా మనం దోపిడీ చెయ్యలేదు. వాసుధైక కుతుమ్బకమన్నది మన భావన. అమెరికాలో ఫీనిక్స్ అనే చోట గ్రాండ్ కాన్యోన్స్ అనే చోటికి వెళ్లాను. 500 కి. మీ పొడవు, 50 కి.మీల వెడల్పు వుంటుంది. మూడు పర్వతాలకు బ్రహ్మ విష్ణు, మహేశ్వరులనే పేర్లు పెట్టి వున్నారు. అడిగితే కొన్ని వేల సంవత్సరాల నుంచి అవి అలా పిలువబడుతున్నాయని చెప్పారు. అందువల్ల జాతుల మధ్య సమన్వయం అవసరం. దోపిడీ, ఈర్ష్య, అసూయ కాదు. ఏకాత్మ మానవ దర్శనముంటే అమెరికా ప్రపంచాన్ని అతలాకుతలం చేయజూడదు. మన దగ్గర ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతముంది కానీ మన జాతి ఆచరించని కారణంగా మనం అణచివేతకు గురౌతున్నాము. వికృతంగా ప్రవర్తించే అమెరికా, రష్యా లాంటి దేశాలు పరివర్తన చెందాలంటే ఏకాత్మ మానవ దర్శనమాధారంగా మన సమాజం సంఘటితం కావాలి. కులం, మతం, భాష ఆధారంగా కాకుండా ఏకాత్మ మానవ దర్శనమాధారంగా మన సమాజం సంఘటితమైనపుడు అన్ని దేశాలు ఒక దారిలోకి వస్తాయి. అర్ధ, కామాలు అవసరమని చెప్పారు దీనదయాళ్జీ. వీటికి అటూ, ఇటూ ధర్మము, మోక్షమనే గట్లు అవసరం. ప్రతి వ్యక్తికీ పని కల్పించాలి, ప్రతి వ్యక్తీ కష్టించాలి. మన విధానాల వల్ల కొద్దిమంది చేతిలోకి మాత్రమే డబ్బులు వెళ్ళకూడదు. “We want production by the masses. But not the mass production” – Gandhiji.
గ్రామము ఆధారంగా, వ్యవసాయం కేంద్రంగా ఆర్ధిక ఉన్నతి జరగాలి. మనం నెలకు డెబ్బైవేలు, లక్ష , లక్షా యాభై వేలు సంపాదించే వారి మధ్య ఉన్నాము. మంచిదే. నేను ఈ మధ్య తుముకూరు దగ్గర ఒక అంబేద్కర్ కాలనీకి వెళ్ళాను. పది రోజులకొకసారి కూడా నీళ్ళు రావక్కడ. ఇది జరుగకూడదు. ఇది అన్యాయం, అధర్మం. గ్రామం, వ్యవసాయం కేంద్రంగా ఆర్ధిక ప్రణాళికలు జరగాలి. నేనీ చొక్కాను అయిదారు వందలు వెచ్చించి కొన్నాను. నా రైతు టమాటా పండిస్తే, వరి పండిస్తే, గోధుమలు, కూరగాయలు, ఆవు పాలు పండిస్తే అమ్ముకునే దిక్కులేదు. ఇది కాదు సరైన ప్రణాళిక. ఇది కాదు అభివృద్ధి. దీనదయాళ్జీ సిద్దాంతం మానవత్వంతో కూడుకున్నది. ఈ రోజు కొద్ది మంది చేతుల్లోకి డబ్బు వెళ్ళిపోయింది. కొద్దిమంది గుత్తాధిపత్యం వహించడం, కొద్దిమంది రాజకీయ పార్టీలను పోషించడం, కొద్దిమంది పత్రికలు,టీవీ చానళ్ళు, రాజకీయ పార్టీలు కలిసి ప్రజలను పిచ్చి వాళ్ళను చెయ్యడం. ఇదంతా అధర్మమైన ఆర్ధిక నీతి. ఇది ఏకాత్మ మానవ దర్శనానికి వ్యతిరేకమైనది. అందువల్ల మనందరం నష్టపోతున్నాము. ఏ పత్రికకూ, చానల్ కూ మనం వ్యతిరేకం కాదు. అందర్నీ మనం గౌరవించాల్సిందే. కానీ గుత్తాధిపత్యాన్ని మాత్రం సహించరాదు.
ఆర్ధిక విధానాల వల్ల సామాన్యుడికి, కష్ట జీవికి న్యాయం జరగాలి. అలాంటి ఆర్ధిక విధానాన్ని, అలాంటి ప్రభుత్వ విధానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే మళ్ళీ ఏకాత్మ మానవ దర్శనముండాలి. అప్పుడే ప్రతి ఒక్కరినీ అన్నగా,అక్కాగా, చెల్లిగా, అమ్మగా అనుకోగలం. ఒక డాక్టర్ సరిగా వైద్యం చేస్తాడు, ఒక వ్యాపారస్తుడు సరిగా వ్యాపారం చేస్తాడు, ఒక ఉపాధ్యాయుడు సరిగా పాతం చెబుతాడు. ఈ విధంగా ఆర్ధిక స్థితి మెరుగుదలకు ఏకాత్మ మానవ దర్శనం ఆధారం. ఆ విధంగా మన దేశ ప్రజల స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా మనము మనదైన ఏకాత్మ మానవ దర్శనాన్ని అనుసరించాలి. విదేశాల నుంచి దేశానికి అనుకూలంగా, స్వదేశం నుంచి వచ్చినదానిని యుగానికి అనుకూలంగా మల్చుకోవాలన్నది ఆర్యోక్తి. మన సమాజాన్ని చైతన్యవంతం చెయ్యాలి. గుడ్డిగా పరానుకరణ కాదు. మన ఆర్ధిక ఉన్నతి, మన సామాజిక ఉన్నతిని సాధించాలి.
“ కొంతమంది సంస్కృతిని గురించి చెబుతూ సంస్క్రుతిలోని చెడునంతా గౌరవిస్తారు. ఇది మంచిది కాదు.” అని దీనదయాళ్జీ చెప్పారు. మన సంస్కృతిలోని కుల భేదాలు, భాషా భేదాలు, బాల్య వివాహాలు వంటి వాటిని సమూలంగా పెకలించివేయాలని ఆకాంక్షించారు. నేడు దీనదయాళ్జీ దేహం లేకపోయినా తత్వం బ్రతికే వుంది. శరీరము, బుద్ది, మనస్సు, ఆత్మ సమన్వయం జరగాలి. ధర్మార్ధ మోక్ష సాధన జరగాలంటే బ్రహ్మచర్యము,గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనివార్యము. మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు సంతానోత్పత్తి తర్వాత బ్రంహచర్యం పాటిస్తున్న కారణంగానే సమాజం ఇప్పటికీ బ్రతికి వుంది. వారే గనక చెడిపోతే ఏ పోలీస్ స్టేషను, ఏ ప్రభుత్వము ఈ సమాజాన్ని రక్షించలేదు. అలాగే గృహస్థాశ్రమ ధర్మం అత్యంత ముఖ్యమైనది. గృహస్థుకి సప్త సంతానమట. 1] స్వంత సంతానం, 2] సమాజం, ౩] వికలాంగులు, 4] చెట్టు నాటడం, 5] చెరువు త్రవ్వించడం, 6] దేవాలయానికి సాయం చెయ్యడం, 7] సాదు సంతులకు సహాయం చెయ్యడం, ఆదరించడం. మన రుశులందరూ సంసారులు, గృహస్థులు. సమాజానికి ఆధారం గృహస్థులు.
సమాజంలో వుంటూనే సమాజాన్ని సేవించాలి. మనదరి వెనకాల దైవీ శక్తి వుంది నడిపిస్తోంది. మనం కేవలం సాధనాలం. 2025 – 2050 మధ్య కాలంలో ఏకాత్మ మానవ వాదానికి అనుకూలమైన వాతావరణం నిర్మాణమౌతుందని ఆశిస్తున్నాను.





