
859views
అసోంలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అసోం రైఫిల్స్ దళం, పోలీసులు.. దిమాస నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరి గాయి. ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఘటనా స్థలంలూ నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో డీఎన్ఎల్ఏ సహ ఇతర ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.





